తాగిన మత్తులో వ్యక్తి వీరంగం
eenadu telugu news
Updated : 27/09/2021 12:28 IST

తాగిన మత్తులో వ్యక్తి వీరంగం

పోలీసులపై దాడి, జీపు అద్దాలు ధ్వంసం

ధ్వంసమైన పోలీసు వాహనం అద్దాలు

రాజోలి, న్యూస్‌టుడే : తాగిన మత్తులో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి, వారి వాహనం అద్దాలు ధ్వంసం చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై లెనిన్‌ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మణ్‌, మాబాష మద్యం తాగేందుకు రాజోలికి వచ్చారు. ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో మద్యం తాగారు. పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు వచ్చి టెస్టింగ్‌ మిషన్‌ ఊదాలని మందుబాబులకు చెప్పారు. లక్ష్మణ్‌ ఊదకుండా ఎస్‌ఐతో పాటు, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, విష్ణు, శ్రీనివాసులు, ఓబుల్‌రెడ్డిలను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు. రాళ్లతో కొట్టి దాడికి పాల్పడ్డాడు. పోలీసు వాహనం వెనకాల అద్దాలను తలతో కొట్టి ధ్వంసం చేశాడు. పోలీసులు అప్రమత్తమై ఆ వ్యక్తిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని