ఆదోనిలో బంద్‌ ప్రశాంతం
eenadu telugu news
Updated : 27/09/2021 17:10 IST

ఆదోనిలో బంద్‌ ప్రశాంతం

ఆదోని మార్కెట్‌: ఆదోని నియోజకవర్గంలో భారత్ బంద్‌ సోమవారం ప్రశాంతంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా అఖిలపక్ష నాయకులు డిపో బయట బైఠాయించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ చేయడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. వామపక్ష నాయకులు వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో భూపాల్‌ చౌదరి, రాధాకృష్ణ, అజయ్‌బాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని