శ్రీగిరి క్షేత్రం.. గౌరవర్ణ శోభితం
eenadu telugu news
Updated : 15/10/2021 06:18 IST

శ్రీగిరి క్షేత్రం.. గౌరవర్ణ శోభితం

స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ

స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం శ్రీభ్రమరాంబాదేవి భక్తులకు మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవ వేదికపై ఆసీనులైన మహాగౌరి అమ్మవారికి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, ఈవో ఎస్‌.లవన్న దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. భ్రమరాంబాదేవి ఆలయ ప్రాంగణంలో 2022 దేవస్థానం కాలమానిని ఆవిష్కరించారు.

నేడు నిజరూపాలంకరణ

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో శ్రీభ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో దర్శనమివ్వనున్నారు. శ్రీస్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరుగనుంది. సాయంత్రం శ్రీభ్రమరాంబాదేవి నిజరూపాలంకరణలో దర్శనమివ్వనున్నారు. నందివాహసేవ, ఆలయ ఉత్సవం జరుగనున్నాయి.

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి వెలంపల్లి.

శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శిల్పా తదితరులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని