ఆగిన వరద..గేట్ల మూసివేత
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

ఆగిన వరద..గేట్ల మూసివేత

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్‌లో 931 టీఎంసీల వరద వచ్చింది. దిగువకు 751 టీఎంసీలు విడుదల చేశారు. తెరిచి ఉంచిన ఒక్క గేటును వరద ప్రవాహం తగ్గడంతో మూసివేశారు. జూరాల, సుంకేసుల నుంచి 67,461 క్యూసెక్కులు జలాశయానికి వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,759 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం సాయంత్రం 6 గంటలకు 884.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే వరద ప్రవాహం తగ్గింది. మరికొన్ని రోజులు వరద కొనసాగుతుందని జలవనరులశాఖ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికి వచ్చింది

శ్రీశైలం జలాశయానికి ఆల్మట్టి, తుంగభద్రల నుంచి ఇప్పటి వరకు 993.43 టీఎంసీలు వచ్చి చేరింది. ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌, తుంగభద్ర జలాశయాల్లో నీటినిల్వలు గరిష్ఠ స్థాయిలోనే ఉన్నాయి. మరికొన్ని రోజులు వరద వచ్చే అవకాశం ఉంది.

ఎక్కడి నుంచి ఎంత (టీఎంసీలు)

జూరాల 776.52

సుంకేసుల 153.42

హంద్రీ నుంచి 1.49

విద్యుదుత్పత్తికి

శ్రీశైలం జలాశయానికి 931 టీఎంసీల్లో 751.59 టీఎంసీల నీటిని విద్యుదుత్పత్తి, ఎత్తిపోతల పథకాలకు విడుదల చేశారు. 383.35 టీఎంసీల నీటిని కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాలు విద్యుదుత్పత్తికి వినియోగించారు. గేట్ల ద్వారా(స్పిల్‌వే) 254.98 టీఎంసీలు , కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 10.45 టీఎంసీలు, హంద్రీనీవాకు 12.93 టీఎంసీలు, పోతిరెడ్డిపాడుకు 87.72 టీఎంసీల విడుదలైంది. 2.16 టీఎంసీల నీరు ఆవిరిగా మారింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని