వంతెనల ఏర్పాటుకు సహకరించాలి
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

వంతెనల ఏర్పాటుకు సహకరించాలి

రైల్వే జీఎంను కోరిన ఆర్థిక మంత్రి బుగ్గన

రైల్వే జీఎంతో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

డోన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, రైల్వే జీఎం గజానన్‌ మాల్యాను సికింద్రాబాద్‌లో గురువారం కలిశారు. ఈ సందర్భంగా డోన్‌లోని పాతపేట ప్రాంతంలో అండర్‌ పాస్‌ వంతెన ఏర్పాటు, రైల్వే గేట్ల మధ్యలో అండర్‌పాస్‌, బేతంచర్లలో అండర్‌పాస్‌ వంతెనల ఏర్పాటుపై ఆయనతో చర్చించారు. డోన్‌లోని పాతపేట ప్రాంతానికి వెళ్లే రైల్వే గేట్‌ ప్రాంతంలో పురపాలక నిధులు రూ.75 లక్షలతో డ్రైనేజీ కాల్వలు నిర్మించారని, దీంతో అక్కడ అండర్‌పాస్‌ వంతెనకు ఇబ్బందులు లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మూడు ప్రాంతాల్లో అండర్‌ పాస్‌ వంతెనలు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ సమస్య ఉండదన్నారు. డోన్‌లో రైల్వే గేట్ల ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయని, దీని పరిష్కారానికి ఈ ప్రాంతంలో అండర్‌పాస్‌ వంతెన ఏర్పాటు ముఖ్యమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈపనులు త్వరితగతిన చేసేలా చూడాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని