రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ మృతి
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ మృతి

దీబగుంట్ల(గోస్పాడు), న్యూస్‌టుడే: మండలంలోని దీబగుంట్ల మెట్ట వద్ద ఆటో బోల్తా పడి పాస్టర్‌ మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ధనమ్మ వివరాల మేరకు నంద్యాల మండలం చెన్నూరులో పాస్టర్‌ గోస దానమయ్య(70) విధులు ముగించుకొని స్వగ్రామం బుగ్గానపల్లెకు మధ్యాహ్నం పయనమయ్యారు. దీబగుంట్లలో ఆటో ఎక్కి వెళ్తుండగా డ్రైవర్‌ మస్తాన్‌వలి ఓవర్‌ టేక్‌ చేయడానికి వెళ్లి రోడ్డు దిగగా ఆటో కంట్రోల్‌ చేసుకోలేక బోల్తా పడింది. అందులోనున్న దానమయ్యపై పడడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. దానమయ్య కుమారుడు విక్రంరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని