పండగ వేళ ధరాఘాతం
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

పండగ వేళ ధరాఘాతం

మార్కెట్లో అమ్మకానికి ఉంచిన ఉల్లిగడ్డలు

బనగానపల్లి, న్యూస్‌టుడే: విజయదశమి పండగ వేళ ఒక్కసారిగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఒకేసారి ఉన్న ఫలంగా రెండింతలు పెరిగి పోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దినసరి మార్కెట్‌కు వచ్చిన వినియోగదారులకు ఒక్కసారిగా ధరలు చూసి ఖంగు తినే పరిస్థితి. పది రోజుల కిందట కిలో ఉల్లిగడ్డలు రూ30 ఉండగా, ఒకేసారి రూ.50కి ధర చేరింది. వంకాయలు రూ.30 నుంచి రూ.60కి, టమోటా రూ.10 నుంచి రూ.50కి పెరిగాయి. కూరగాయల ధరలు రెండింతలు పెరగడంతో పండగ సరకులకు వచ్చిన జనం జేబులు ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది.

ధరలు పెరిగిపోయాయి

- గోపీకృష్ణ, వినియోగదారుడు

పది రోజుల్లో కూరగాయల ధరలు ఊహించని విధంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంత మార్కెట్లో ఏవి కొనాలన్నా వందల రూపాయలు వెచ్చించాల్సిందే. కొనడానికి వెళ్తే ఏదైనా కిలో రూ.50 పలుకుతోంది. ధరలు తగ్గించాల్సిన అవసరం ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని