పండగొచ్చింది..సందడి తెచ్చింది
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

పండగొచ్చింది..సందడి తెచ్చింది

నగరంలో కిక్కిరిసిన వీధులు

కొండెక్కిన పూల ధరలు

పూల బజార్‌ వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

దసరా నేపథ్యంలో నగరంలో పెద్దఎత్తున సందడి నెలకొంది. ముఖ్యంగా పూలకు డిమాండ్‌ ఏర్పడింది. పూల బజార్‌లో బంతిపూల కొనుగోళ్లకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో కిలో బంతిపూలు రూ.60 కాగా పండగను ఆసరాగా చేసుకుని బంతి పూలు కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్మారు. గులాబీ పూల ధరలు సైతం కొండెక్కాయి. మరోవైపు పండగ నేపథ్యంలో పూజా సామగ్రి కొనుగోలు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఫలితంగా పాత బస్తీ, పూల బజార్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. - ఈనాడు, కర్నూలు

పూజా సామగ్రి కొనుగోలు చేస్తున్న జనం

వెంకటరమణ కాలనీలో పూల విక్రయాలు...

వివిధ వస్తువులు కొనుగోలు చేస్తూ..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని