దేవాలయ నిర్మాణానికి భూమిపూజ
eenadu telugu news
Published : 15/10/2021 20:10 IST

దేవాలయ నిర్మాణానికి భూమిపూజ

సీబెళగల్‌: మండలంలోని గుండ్రేవుల గ్రామంలో శుక్రవారం ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం కోసం కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌ భూమిపూజ చేశారు. ఆలయ నిర్వాహకులు శివ ఇంటి నుంచి చిందులు తొక్కుతూ మేళతాళాలతో ఎమ్మెల్యేను ఊరేగిస్తూ ఆలయ స్థలం దగ్గరికి తీసుకొచ్చారు. నిర్మాణ స్థలంలో పురోహితులు హోమం చేశారు. అనంతరం ఎల్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ బొంతల మునప్ప, గూడూరు పట్టణ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, గ్రామపెద్దలు యోహాన్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని