ఘనంగా విజయదశమి వేడుకలు
eenadu telugu news
Published : 15/10/2021 20:09 IST

ఘనంగా విజయదశమి వేడుకలు

సీబెళగల్‌: మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం విజయదశమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీబెళగల్‌లో వాసవీమాత, దుర్గాదేవి, పడమటి ఆంజనేయస్వామి, రంగస్వామి దేవతా ఉత్సవమూర్తులను ఆయా పల్లకీల్లో గ్రామ వీధుల్లో ఊరేగించారు. బస్టాండ్‌లోఉన్న జమ్మిచెట్టు ప్రాంతానికి చేరుకుని శమీపూజ చేశారు. మండలంలోని పోలకల్‌, కొత్తకోట, ఉడుమాల, గుండ్రేవుల, పురాందుతి, బ్రాహ్మణదొడ్డి తదితర గ్రామాల్లో దసరా వేడుకలు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని