Road Accident: ప్రైవేట్‌ బస్సు బోల్తా: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
eenadu telugu news
Published : 27/10/2021 07:51 IST

Road Accident: ప్రైవేట్‌ బస్సు బోల్తా: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

ఉలిందకొండ: కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు హైదరాబాద్‌ నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని