Updated : 23/05/2020 19:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమస్యలు పరిష్కరించాలని దీక్ష

అమరచింత: అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పురపాలిక కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. దీక్షలో సీపీఐ జిల్లా కార్యదర్శి, కౌన్సిలర్‌ జయరాములు, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి అయుబ్‌ఖాన్‌, తెదేపా జిల్లా కార్యదర్శి తిరుమలేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురపాలిక బడ్జెట్‌ను రెండు సార్లు ఆమోదించడం పట్ల ఆంతర్యమేంటని వారు ప్రశ్నించారు. పురపాలిక ఏర్పడి మూడేళ్లవుతున్నా టౌన్‌ ప్లానర్, అకౌంటెంట్‌, ఇంజినీర్‌ ఉద్యోగుల నియామకం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అనుమతుల్లేకుండా రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. మిషన్‌ భగీరథ నీటిని ప్రతి ఇంటికి ఎప్పుడు సరఫరా చేస్తారన్నారు. ప్రాథమిక ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటుల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దీక్షలో సీపీఐ నాయకులు సురేష్‌, నాగరాజు, అబ్రహం, రాబర్ట్‌, లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ నాయకులు విష్ణు, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని