close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా విషాదం: మరణంలోనూ వీడని అన్నదమ్ముల బంధం

చిన్నచింతకుంట: రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోన్న కరోనా వైరస్‌ మానవాళికి తీరని వేదననే మిగుల్చుతోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఈ రక్కసి కోరల్లో చిక్కుకొని ఓ వ్యక్తి బలికాగా.. అది తట్టుకోలేక అతడి సోదరుడూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చిన్నచింతకుంట మండలం వడ్డేమాను గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేమానుకు చెందిన నాగేశ్వరరెడ్డి (57) కరోనాతో పది రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. అతడి మృతదేహానికి కొవిడ్‌ నిబంధనల ప్రకారం అతడి స్వగ్రామంలోనే గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన రెండు గంటల వ్యవధిలోనే అతడి అన్న సుదర్శన్‌ రెడ్డి (60) గుండెపోటుతో హఠాన్మరణానికి గురికావడం విషాదం నింపింది. కేవలం 24గంటల్లోనే అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

మరిన్ని వార్తలు

కేంద్ర వ్యవసాయ బిల్లు రైతులకు గొడ్డలిపెట్టు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లు రైతాంగానికి గొడ్డలిపెట్టుగా మారనుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయనతోపాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ మార్కెటింగ్‌ విధానంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ చట్టం ద్వారా రైతులు కనీస మద్దతు ధర ఇస్తుందన్న భరోసా లేదన్నారు. విపక్షాలతోపాటు ఎన్డీయే మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ సైతం

ప్రధానాంశాలు

ఆగని పీడీఎస్‌ బియ్యం దందా !

గద్వాల అడ్డాగా పీడీఎస్‌ బియ్యం దందా ఆగట్లేదు. కోరలు చాచిన బియ్యం మాఫీయాకు ప్రభుత్వ కేసులంటే లెక్కలేని పరిస్థితి నెలకొంది. గద్వాల కేంద్రంగా ప్రతినెలా పోలీసులు బియ్యం తరలిస్తున్న వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అధికారులు పట్టుబడిన ప్రతిసారి సాధారణ కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడిన వాహనాలు నెలరెన్నళ్లలోపే బయటకు వస్తున్నాయి. తిరిగి అవే వాహనాలను దందాకు ఉపయోగిస్తున్నారు. ధరూరు, కేటిదొడ్డి, గట్టు మండలాలను అడ్డాగా చేసుకొని కర్ణాటకలోని మిల్లులకు పీడీఎస్‌ బియ్యాన్ని ఏజెంట్లు తరలిస్తున్నారు. గద్వాల కేంద్రంగా ఉన్న

కబ్జా స్థలాల్లో వర్ష బీభత్సం

పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, వెంచర్లు వరదనీటికి మునుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. వరద ఉధృతి పెరిగిన కొద్దీ దిగువనున్న కాలనీల్లోని రోడ్లు, ఇళ్లు నీట మునిగాయి. శిఖం, ఎఫ్‌టీఎల్‌, వరద కాల్వలు, పంట కాల్వలను కబ్జాచేసి నిర్మించిన ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. చెరువుల శిఖం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో అనుమతి లేకుండా ఇళ్లను నిర్మించుకోవడంతో ప్రస్తుతం ఇబ్బందులు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.