పాలిసెట్‌లో పాలమూరు విద్యార్థుల ప్రతిభ
eenadu telugu news
Published : 29/07/2021 04:01 IST

పాలిసెట్‌లో పాలమూరు విద్యార్థుల ప్రతిభ


దిండు శ్రీకీర్తి (18వ ర్యాంకు)

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : పాలిసెట్‌-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈనెల 17న నిర్వహించిన పరీక్షకు జిల్లా నుంచి 3,051 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాల వారీగా టాప్‌-3లో ఎంపీీసీీ విభాగంలో దిండు శ్రీకీర్తి రాష్ట్రస్థాయిలో 18వ ర్యాంకు, బెక్కరి అమూల్య 39, కె.సాయి బాలవర్ధన్‌ 53వ ర్యాంకు సాధించారు. ఎంబైపీీసీీ విభాగంలో హెచ్‌.రమీత్‌కుమార్‌ 38వ ర్యాంకు, గౌనికాడి ప్రియాంక 61, బొమ్మన్‌ అభినవ్‌ 87వ ర్యాంకు సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం ఏనుగొండకు చెందిన డి.విజయ్‌కుమార్‌, గీత కుమార్తె డి.శ్రీకీర్తి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 9, 10వ తరగతలు హైదరాబాదులో చదివింది. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో వారి సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదివి ఈ ర్యాంకు సాధించానని శ్రీకీర్తి తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని