పేట కోర్టుకు పీసీసీ అధ్యక్షుడు
eenadu telugu news
Published : 23/10/2021 06:00 IST

పేట కోర్టుకు పీసీసీ అధ్యక్షుడు

అభిమానులతో రేవంత్‌రెడ్డి కరచాలనం

పాతబస్టాండ్‌ (నారాయణపేట), న్యూస్‌టుడే : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2009లో కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు నమోదైన కేసు విషయంలో శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నారాయణపేట కోర్టుకు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడయ్యాక మొదటిసారి జిల్లాకు రావడంతో యువజన కాంగ్రెస్‌ నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కరచాలనం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్దూరు జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బండి వేణుగోపాల్‌, నాయకులు ఎండీ గౌస్‌, కోట్ల రవీందర్‌రెడ్డి, సదాశివరెడ్డి ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని