5 రోజుల హైడ్రామాకు తెర
eenadu telugu news
Published : 23/10/2021 06:00 IST

5 రోజుల హైడ్రామాకు తెర

6ఏ కేసు నమోదు
న్యూస్‌టుడే, గద్వాల పట్టణం

పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అయిదు రోజుల తర్వాత ఖాళీ లారీల దర్శనం

సీఎంఆర్‌ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఎట్టకేలకు 6ఏ కేసు నమోదు చేశారు. గద్వాల నుంచి తమిళనాడుకు సీఎంఆర్‌ ధాన్యాన్ని ఈ నెల 18న మూడులారీల్లో తరలిస్తుండగా మల్దకల్‌ మండలం బూడిదపాడు వద్ద సివిల్‌ సప్లై అధికారిని రేవతి తన సిబ్బందితో పట్టుకున్నారు. అదే రోజు పట్టణ పోలీసు స్టేషన్‌లో లారీలను ఉంచారు. 5 రోజుల తర్వాత ఆంజనేయ ట్రేడర్స్‌ను పరిశీలించి మిల్లులోని 55,969 బస్తాలు సీజ్‌ చేసి యజమాని భాగ్యమ్మ, మరో లారీలో తరలిస్తున్న 600 బస్తాలు సీజ్‌ చేసి నరేష్‌ అనే వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న సీఎంఆర్‌ ధాన్యం విలువ రూ.4.30 కోట్లు ఉంటుందని మొత్తం రూ.11 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్‌ చేసినట్లు పౌరసరఫరాల అధికారిని తెలిపారు. సీజ్‌ చేసిన సీఎంఆర్‌ ధాన్యాన్ని విశాలాక్షి రైస్‌ మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ నివేధికను కలెక్టర్‌ క్రాంతికి అందజేసినట్లు తెలిపారు.

లెక్కలు సరిచేసేందుకేనా?
అక్రమంగా తరలిస్తున్న సీఎంఆర్‌ ధాన్యం లెక్కలు సరి చేసేందుకు సివిల్‌ సప్లై అధికారులకు 5 రోజుల సమయం పట్టిందని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రైస్‌ మిల్లుకు ఇచ్చిన సీఎంఆర్‌ ధాన్యంలో 80 శాతం ఇతర రాష్ట్రాలకు తరలిపోయిందని, ఇతర మిల్లుల నుంచి తెచ్చి పట్టుబడిన మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం ఉంచిన తరవాత కేసులు నమోదు చేశారని చర్చించుకుంటున్నారు.


క్రిమినల్‌ కేసుల నమోదులో జాప్యం

క్రమంగా తరలిస్తున్న సీఎంఆర్‌ ధాన్యం విషయంలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నా క్రిమినల్‌ కేసులు నమోదు చేయించడంలో జాప్యం జరుగుతోంది. పట్టణ పోలీసు స్టేషన్‌లోని ధాన్యంను ఇతర మిల్లులకు తరలించి ఖాళీ లారీలను స్టేషన్‌లోనే ఉంచారు. ఇంత తతంగం జరిగినా క్రిమినల్‌ కేసులు నమోదు చేయించలేదు. అసలు నేరస్థులను వదిలి పెట్టిన అధికారులు బినామీల మీద 6ఏ కేసులు నమోదు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు నేరస్థులను కాపాడేందుకు 5 రోజుల సమయం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఈ తతంగంపై పెద్ద చర్చ కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని