రూ.8.5 కోట్లతో దుద్దెడ చౌరస్తా అభివృద్ధి
logo
Published : 03/07/2020 05:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.8.5 కోట్లతో దుద్దెడ చౌరస్తా అభివృద్ధి

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌లో సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: రాజీవ్‌ రహదారిలోని సిద్దిపేట జిల్లా దుద్దెడ చౌరస్తాను రూ.8.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దుద్దెడ చౌరస్తాను నాలుగు శ్రేణులుగా విభజించి, విభాగిని, నడకదారి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా దుద్దెడ సమీపంలో నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభం కానుందన్నారు. ఈ నేపథ్యంలో దుద్దెడ చౌరస్తా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అక్కడ రహదారి విస్తరణకు అడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కరుణాకర్‌బాబుకు చరవాణిలో సూచించారు. సిద్దిపేట శివారులోని పొన్నాల వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు యుద్ధప్రాతిపదిక ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాజీవ్‌ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు సంరక్షించాలన్నారు. నర్సాపూర్‌ వద్ద ప్రమాదాల నివారణకు సర్వీస్‌ రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో ఈఎన్‌సీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని