close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యక్ష ఆందోళన

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

పార్టీనేత నారాయణకు నివాళులర్పిస్తున్న జాతీయ, రాష్ట్ర కార్యదర్శులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: హుస్నాబాద్‌ ప్రాంతానికి సాగునీరందించే గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని పార్టీలతో కలసి ప్రత్యక్ష ఆందోళన చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం హుస్నాబాద్‌లోని సీపీఐ కార్యాలయంలో ఆయన పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి సాగునీరందించాలని, భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్‌తో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. తాను శాసనసభ్యుడుగా ఉన్న సమయంలో 2007లో ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం హుస్నాబాద్‌లో కుర్చీ వేసుకుని వీటి నిర్మాణాలు పూర్తి చేయిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. వరద కాలువ నిర్మాణంపై నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు 80 శాతం వరకు చేశారని చెబుతున్నారని, మిగిలిన పనులు ఎపుడు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. గండిపల్లి ప్రాజెక్టునూ పట్టించుకోవడం లేదన్నారు. రీడిజైన్‌ తర్వాత ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లతో అంచనాలు పంపించినా ఇప్పటి వరకు మంజూరుకు నోచుకోలేదన్నారు. అంతకు ముందు మూడు రోజుల క్రితం మరణించిన సీపీఐ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి మాదన నారాయణ పటానికి జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలో ఇటీవల మరణించిన పంతం హనుమంతు, కాంతాల నారాయణరెడ్డి కుటుంబాలను పరామర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మల్లేశ్‌, వనేశ్‌, లక్ష్మినారాయణ ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.