14 మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తి
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

14 మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తి


పరిశీలిస్తున్న డీఆర్డీవో, డీపీవో

తూప్రాన్‌: అన్ని మండలాల్లో బృహత్‌ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసి పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం వారు మండలంలోని దాతర్‌పల్లిలో పర్యటించి మాట్లాడారు. ఈ వనాలను జిల్లాలోని 21 మండలాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల కేంద్రాల్లో అనువైన స్థలాలు లేకుంటే ఏదైనా గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు ఒక్కోదానికి రూ.42 లక్షల చొప్పున ఖర్చు చేస్తామన్నారు. నాలుగు బ్లాకులుగా 32 వేల మొక్కలను నాటేలా ప్రణాళికలు చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని 14 మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తయిందని, ఆగస్టు 15న అన్ని మండల కేంద్రాల్లో వీటిల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చూడతామన్నారు. పంచాయతీ కార్యదర్శి సంగమేశ్వర్‌ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని