ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: భాజపా
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: భాజపా


కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న నాయకులు

మెదక్‌, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఎమ్మెల్యేలు పదవుల కోసం పాకులాడకుండా, నియోజకవర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. అలా చేస్తేనే హుజూరాబాద్‌ మాదిరిగా ఉప ఎన్నిక జరిగి, నియోజకవర్గానికి అవసరమైన నిధులు రావడంతో పాటు ఏడేళ్లలో జరగని అభివృద్ధి కేవలం మూడు నెలల్లో జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హమీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రి వర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించినందుకు అంతకుముందు స్థానిక రాందాస్‌ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్‌కుమార్‌, సుధాకర్‌రెడ్డి, దళిత, ఓబీసీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు యాదగిరి, రమేశ్‌గౌడ్‌, సందీప్‌రమాకాంత్‌, బాధ్యులు రమేశ్‌గౌడ్‌, శివ, గణేశ్‌, రాజేందర్‌, సంతోష్‌, మధుసూదన్‌, ప్రభాకర్‌, రాములు, ప్రసాద్‌, నిఖిల్‌, కృష్ణ, గోవింద్‌, పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని