వసతుల కల్పనకు నిధుల కేటాయింపు: ఎమ్మెల్సీ
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

వసతుల కల్పనకు నిధుల కేటాయింపు: ఎమ్మెల్సీ


ఉపాధ్యాయులకు సభ్యత్వం ఇస్తున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

నర్సాపూర్‌, చిలప్‌చెడ్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించిందని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమష్టిగా ఉండాలని, తద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని సూచించారు. 72 విభాగాల్లోని ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను సాధించామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 12 ఏళ్ల పాటు పని చేసిన సీనియర్‌ సహాయకులకు గెజిటెడ్‌ హోదాను ఇవ్వాలని కోరామన్నారు. పీఆర్టీయూలో 30 వేల మందికి సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. నర్సాపూర్‌తో పాటు చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వాన్ని ఆయన అందించారు. రాష్ట్ర బాధ్యులు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి కృష్ణ, నాయకులు లాలూనాయక్‌, మల్లయ్య, లక్ష్మీనారాయణ, చందర్‌, చెన్నా, రవి, మాధవశర్మ, మదన్‌మోహన్‌, దుర్గాప్రసాద్‌, లక్ష్మీనారాయణ, చందర్‌, శ్రీనివాస్‌, శ్రీనివాసరావు తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని