శిఖంలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

శిఖంలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

పరిశ్రమ ప్రతినిధులను ప్రశ్నిస్తున్న డీఈ శ్రీకాంత్‌, ఏఈ అనురాధ

మనోహరాబాద్‌: చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్‌ నీటి పారుదల శాఖ డీఈ శ్రీకాంత్‌ హెచ్చరించారు. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి చెరువు శిఖంలో అక్రమంగా రహదారి నిర్మాణం చేపడుతున్నారని ‘శిఖంలో రహదారి నిర్మాణం’ శీర్షికన ‘ఈనాడు’లో ఈనెల 1న ప్రచురితమైన కథనానికి డీఈ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఘటనా స్థలాన్ని ఏఈ అనురాధతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడుతూ.. చెరువు శిఖంలో రహదారి నిర్మాణం చేపట్టడం చట్టరీత్యా నేరమని, అక్రమంగా ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మరోసారి ఇలా చేస్తే ఉన్నతాధికారులకు చెప్పి క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తానని హెచ్చరించారు. శిఖంలో నిర్మించిన రహదారిని పూర్తిగా తొలగించాలని పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. సర్వేయర్‌ స్వరూప్‌ తదితరులున్నారు.

సర్పంచి, కార్యదర్శికి తాఖీదులు జారీ

చిలప్‌చెడ్‌: మండలంలోని రహీంగూడ సర్పంచి భర్త బన్సీనాయక్‌ గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను తన వ్యవసాయ పనులకు వినియోగించుకుంటున్న తీరుపై ‘పేరుకే పంచాయతీ ట్రాక్టరు.. వినియోగించేది సొంతానికి.!’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి ఎంపీడీవో శశిప్రభ స్పందించారు. ఈ మేరకు ఎంపీవో పోలేశ్వర్‌రాజు సర్పంచి గన్నీబాయి, కార్యదర్శి ప్రశాంతికి తాఖీదులు ఇచ్చారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తాఖీదులో పేర్కొన్నట్లు ఎంపీవో తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని