కలెక్టర్‌కు వినతుల వెల్లువ
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

కలెక్టర్‌కు వినతుల వెల్లువ

జడ్పీలో... ప్రజా దర్బార్‌ నిర్వహణ

అర్జీలు ఇచ్చేందుకు పోటీపడుతున్న ప్రజలు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్‌ నుంచి ఉన్నతాధికారుల వరకూ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాది నుంచి కరోనా నేపథ్యంలో ఈ విభాగాన్ని ఎత్తేశారు. మండల కేంద్రంలో సమస్యలు పరిష్కారం కాకపోతే కలెక్టర్‌ వద్దకు వెళ్తే సమాధానం దొరుకుతుందని ఎంతో ఆశతో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు వస్తుంటారు. తాజాగా బుధవారం జడ్పీ సమావేశం తర్వాత కలెక్టర్‌ను కలిసేందుకు జనం బారులు తీరారు. జడ్పీలోనే కొద్దిసేపు వినతుల స్వీకరణ చేపట్టగా ఇచ్చేందుకు అర్జీదారులు పోటీ పడ్డారు. ఆయన కారు వద్దకు సైతం వెళ్లి తమ సమస్యలను పలువురు వివరించగా, పరిష్కరిస్తానంటూ ఆయన భరోసా ఇచ్చారు. సదాశివపేట పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి మొరం తరలింపు పేరుతో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని