‘దళితులను ఆకట్టుకోవడానికి ఎత్తుగడ’
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

‘దళితులను ఆకట్టుకోవడానికి ఎత్తుగడ’


కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు జగన్‌, జిల్లా అధ్యక్షుడు అశ్వంత్‌ తదితరులు

సంగారెడ్డి అర్బన్‌: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితులకు ప్రభుత్వం అందించే రుణాలు వెంటనే ఇవ్వాలని భాజపా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కల్వకుంట అశ్వంత్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడేళ్లుగా లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలకు సొమ్ము విడుదల చేయకపోగా... నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. తాజాగా ‘దళిత బంధు పథకం’ పేరుతో ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి కొత్త ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. నిరసనలో పార్టీ రాష్ట్ర నాయకులు జగన్‌, అసెంబ్లీ కన్వీనర్‌ నర్సారెడ్డి, దళిత మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు వాసు, కంది, సంగారెడ్డి మండలాల పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పాపయ్య పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని