రహదారి చెంత.. వ్యవసాయ బావుల చింత!
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

రహదారి చెంత.. వ్యవసాయ బావుల చింత!

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌

అక్కన్నపేట రోడ్డు తోటపల్లి సబ్‌స్టేషన్‌ వద్ద ...

అంతర్‌ జిల్లా రహదారుల పక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. వాటి వద్ద రక్షణ గోడలు లేకపోవడంతో వేగంగా వస్తున్న వాహన చోదకులకు ప్రాణ సంకటంగా మారింది. నిత్యం జన సమ్మర్థం, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మార్గాల్లో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల హుస్నాబాద్‌-కరీంనగర్‌ మార్గంలో చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌ వద్ద కరీంనగర్‌ నుంచి వస్తున్న విశ్రాంత ఎస్‌ఐ పాపయ్య నాయక్‌ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడి మరణించిన సంగతి తెలిసిందే. ఇదే మార్గంలో మూడేళ్ల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి ఒకరు చనిపోయారు. హుస్నాబాద్‌-రామవరం రహదారిలో స్థానిక ఎల్లమ్మ చెరువు కట్ట దిగువన కి.మీ పరిధిలో ఐదు వ్యవసాయ బావుల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అసలే ఇరుకురోడ్డు కావడం.. మరోవైపు ముళ్లచెట్లు పెరిగి పోవడంతో రోడ్డు పక్కన బావులు ఉన్నాయనే విషయం తెలియడం లేదు. హుస్నాబాద్‌ నుంచి మానకొండూరు, అక్కన్నపేట మార్గాల్లో సైతం వ్యవసాయ బావులున్నాయి. వాటి వద్ద రక్షణ గోడలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

రామవరం రోడ్డులో ప్రమాదకరంగా వ్యవసాయ బావి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని