ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు మంజూరు చేయాలి
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు మంజూరు చేయాలి

భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి, నేతలు

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పెండింగ్‌లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళితులను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందన్నారు. కార్పొరేషన్‌ రుణాలను మంజూరు చేస్తే ఉపాధి లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం దళితుల పట్ల ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు స్వామి, ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని