పూర్తయిన ఇళ్లను కేటాయించాలి
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

పూర్తయిన ఇళ్లను కేటాయించాలి

దౌల్తాబాద్‌ సభలో రఘునందన్‌రావు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఎంపీపీ, అధికారులు

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజాసమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బుధవారం దౌల్తాబాద్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ సంధ్య అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సూరంపల్లిలో మార్కెట్‌ త్వరగా పూర్తిచేయాలని.. ఇందుప్రియాల్‌, దొమ్మాట, దౌల్తాబాద్‌లలో అనుమతులు మంజూరైన వాటికి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. దొమ్మాటలో ప్రభుత్వ భూమిని పలువురు కబ్జా చేస్తున్నారని సర్పంచి పూజిత చెప్పగా తక్షణమే సర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ నీలిమకు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీపీ సంధ్య, ఎంపీడీవో మత్స్యేందర్‌, జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు రహీమొద్దీన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, మండల విద్యాధికారి నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. 24 పంచాయతీలకు కేవలం ఆరుగురు సర్పంచులు, 9 మంది ఎంపీటీసీ సభ్యులకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని