కార్మిక చట్టాలు రద్దు చేయాలి: సీఐటీయూ
eenadu telugu news
Updated : 22/09/2021 02:01 IST

కార్మిక చట్టాలు రద్దు చేయాలి: సీఐటీయూ

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. కార్మిక గర్జన పాదయాత్రలో భాగంగా మండలంలోని కాళ్లకల్‌లో మంగళవారం చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేపట్టాలన్నారు. ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్‌, నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని