‘కార్మికులను వంచిస్తోన్న యాజమాన్యాలు’
eenadu telugu news
Published : 22/09/2021 02:28 IST

‘కార్మికులను వంచిస్తోన్న యాజమాన్యాలు’


బీడీ కార్మికులతో కలిసి మాట్లాడుతున్న మల్లేశం

రామాయంపేట, న్యూస్‌టుడే: బీడీ కార్మికులను పరిశ్రమ యాజమాన్యాలు మోసం చేస్తున్నాయని హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం ఆరోపించారు. మంగళవారం మెదక్‌ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో బీడీ కార్మికులను ఆయన కలిసి మాట్లాడారు. చాలా మంది కార్మికులు నాలుగేళ్ల నుంచి పీఎఫ్‌ నంబరుకు నోచుకోవడంలేదని, వారికి సెలవులు కూడా ఇవ్వడంలేదన్నారు. తునికి ఆకు వెయ్యి గ్రాములు ఇవ్వాల్సింది పోయి కేవలం 550 గ్రాములు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. బీడీ పరిశ్రమల యాజమాన్యాలు తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు మధు, లక్ష్మణ్‌ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని