అర్హులందరూ టీకా వేసుకోవాలి..
eenadu telugu news
Published : 22/09/2021 02:28 IST

అర్హులందరూ టీకా వేసుకోవాలి..

జడ్పీ అధ్యక్షురాలు హేమలత


గౌతోజీగూడలో మాట్లాడుతున్న హేమలత

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: అర్హులందరూ తప్పనిసరిగా కొవిడ్‌ టీకా వేసుకోవాలని జడ్పీ అధ్యక్షురాలు హేమలత గౌడ్‌ సూచించారు. మంగళవారం ఆమె తన దత్తత గ్రామం గౌతోజీగూడలో కొవిడ్‌ టీకా ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి టీకా ఇస్తుంటే కొందరు అపోహలతో వేసుకోవడం లేదని, అంతా ధైర్యంగా ముందుకు రావాలన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో జడ్పీ నిధులు రూ.12 లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థకు చేరాయలని ఉపాధ్యాయులు దృష్టికి తీసుకురాగా ప్రత్యేక నిధులతో అదనపు గది నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థులతో హేమలత మాట్లాడారు. వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, సర్పంచి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచి రేణుకుమార్‌, తెరాస నాయకులు శేఖర్‌గౌడ్‌, నాగరాజు, ఆనంద్‌ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని