ఏడుపాయల ఆలయం మళ్లీ మూసివేత
eenadu telugu news
Published : 22/09/2021 02:28 IST

ఏడుపాయల ఆలయం మళ్లీ మూసివేత

సింగూరు ప్రాజెక్టు నుంచి పెరిగిన వరద


ఆలయం ముందు ప్రవహిస్తున్న వరద

పాపన్నపేట: ఎగువన కురిసిన భారీ వర్షాలతో సింగూరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంగళవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. దీంతో ఆలయం వద్ద మంజీరా నది ప్రవాహం పెరగడంతో సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం, సహస్ర నామార్చన అనంతరం ఆలయాన్ని మూసేశారు. అటు వైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహాన్ని పూజలు కొనసాగిస్తున్నారు. భక్తులు ఎవరు వరద బారిన పడకుండా ఏడుపాయల ఔట్‌ పోస్ట్‌ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. వనదుర్గా ప్రాజెక్టు నుంచి 11,489 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుందని, సింగూరు గేట్లు మూసిినందున వరద క్రమంగా తగ్గనుందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని