TS News: జహీరాబాద్‌లో చెరకు రైతుల భారీ ర్యాలీ
eenadu telugu news
Updated : 23/09/2021 01:47 IST

TS News: జహీరాబాద్‌లో చెరకు రైతుల భారీ ర్యాలీ

జహీరాబాద్‌: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చెరకు రైతులు బంద్‌ నిర్వహించారు. పట్టణంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా జహీరాబాద్‌లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు.

జహీరాబాద్‌ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో 10లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు సాగు చేస్తున్నారు. అయితే, జహీరాబాద్‌ సమీపంలోని చక్కెర పరిశ్రమలో రెండేళ్లుగా గానుగ సాగించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఇవాళ బంద్‌ చేపట్టిన తమ నిరసన తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని