మామ అంత్యక్రియలకు వచ్చి గల్లంతు
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

మామ అంత్యక్రియలకు వచ్చి గల్లంతు

చెరువులో స్నానం చేస్తూ నీట మునిగిన అల్లుడు


ఆశగోని పాండు

కంది, న్యూస్‌టుడే: మామ అంత్యక్రియలకు వచ్చిన అల్లుడు చెరువులో గల్లంతైన సంఘటన సంగారెడ్డి గ్రామీణ ఠాణాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చిమ్నాపూర్‌కు చెందిన మునుగల బాలయ్య మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు కంది గ్రామంలో ఉంటున్న కూతురు, అల్లుడు ఆశగోని పాండు(40) వెళ్లారు. కార్యక్రమాల అనంతరం పాండు బంధువులతో కలిసి చిమ్నాపూర్‌ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన బంధువులు ఈ విషయాన్ని గ్రామస్థులు, కుటుంబసభ్యులకు తెలిపారు. పోలీసులు మత్స్యకారుల సహాయంతో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ విషయమై ఎస్సై సుభాష్‌ మాట్లాడుతూ.. బుధవారం గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మామ మృతి చెందిన రోజే అల్లుడు కూడా చనిపోవడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఒకవైపు తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉండగా, భర్త చెరువులో గల్లంతవ్వడంతో కన్నీరుమున్నీరు అయింది. పాండుకు భార్య శారద, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని