జీవితంపై విరక్తితో యువకుడి బలవన్మరణం
eenadu telugu news
Updated : 20/10/2021 06:03 IST

జీవితంపై విరక్తితో యువకుడి బలవన్మరణం

ప్రభాకర్‌

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్‌ మండల పరిధి నర్సంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల ఫ్రభాకర్‌ (27) ఉస్మానియాలో ఎంబీఏ పూర్తిచేసి ఊర్లో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం దౌల్తాబాద్‌లో సొంతంగా ఎరువుల దుకాణం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వారి పొలానికి వెళ్లి మేనబావ సత్యంకు ఫోన్‌ చేసి తాను జీవితంపై విరక్తి చెందానని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. వెంటనే అతను విషయాన్ని ప్రభాకర్‌ సోదరుడు యాదగిరికి తెలుపగా.. అతను పొలం వద్దకు వెళ్లాడు. చెట్టుకు ఉరి వేసుకొని కనిపించిన సోదరుడిని కిందకు దించి చూసినా ప్రయోజనం లేకపోయింది. యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాజిరెడ్డి

మహ్మద్‌షాపూర్‌లో రైతు..

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు యత్నించిన రైతు చనిపోయిన ఘటన దౌల్తాబాద్‌ మండల పరిధి మహ్మద్‌ షాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అన్నారెడ్డిగారి రాజిరెడ్డి (47) పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఏం జరిగిందో ఏమో.. పక్షం రోజులుగా నిత్యం మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి గ్రామ సమీపంలోని రోడ్డుపై పడి పోయాడు. గమనించిన గ్రామస్థులు.. ఏం జరిగిందని ప్రశ్నించగా ఆత్మహత్య చేసుకునేందుకు పురుగు మందు తాగినట్లు చెప్పాడు. దీంతో వారు విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేయగా అంబులెన్స్‌లో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. తండ్రి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని