సంతకు వెళ్లొస్తూ ఒకరి మృత్యువాత
eenadu telugu news
Published : 20/10/2021 05:39 IST

సంతకు వెళ్లొస్తూ ఒకరి మృత్యువాత

తూప్రాన్‌: ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వేగంగా వచ్చిన కారు ఢీకొనగా ద్విచక్రవాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తూప్రాన్‌లో చోటు చేసుకుంది. తూప్రాన్‌ ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన సాహుకారి పెద్దులు (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య బీరమ్మ ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా అందులో ముగ్గురికి వివాహలు అయ్యాయి. మంగళవారం వరిపొలంలో కోసిన ధాన్యాన్ని మాసాయిపేట మండలం బంగారమ్మ దేవాలయం వద్ద రహదారి పక్కన ఆరబెట్టారు. తూప్రాన్‌లో సంత కావడంతో కూరగాయలు తెచ్చేందుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో నాగులపల్లి చౌరస్తా సమీపంలోకి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన పెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహాన్ని ట్రాక్టర్‌లో పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్పందించిన పోలీసులు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని