చిరుధాన్యాలు తినవోయ్‌.. రక్తహీనత దరిచేరదోయ్‌
eenadu telugu news
Published : 20/10/2021 06:38 IST

చిరుధాన్యాలు తినవోయ్‌.. రక్తహీనత దరిచేరదోయ్‌

ఇక్రిశాట్‌తో కలిసి పలు సంస్థల అధ్యయనం

ఈనాడు, సంగారెడ్డి: ప్రస్తుతం ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపొందించుకునే రీత్యా చిరుధాన్యాల వాడకం తప్పనిసరి. వాటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని పరిశోధకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత బాధితులు పెరుగుతున్న తరుణంలో వీటిని తింటే ఎంతో ప్రయోజనకరమని చెబుతున్నారు. ఇక్రిశాట్‌తోపాటు మరో ఆరు సంస్థలు కలిసి చిరుధాన్యాలు చేకూర్చే లాభాలపై దాదాపు నాలుగున్నరేళ్లుగా అధ్యయనం సాగిస్తున్నాయి. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని ఇప్పటికే తేల్చారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్‌ 13.2శాతం, సీరమ్‌ ఫెర్రిటిన్‌ 54.7శాతం వరకు పెరుగుతుందంటున్నారు. ఈ బృందం అందుబాటులో ఉన్న 22 అధ్యయనాలను విశ్లేషిస్తూ ఈ ఫలితాలుంటాయని తేల్చింది. సజ్జలు, రాగులు, అరికెలు, జొన్నలు, కొర్రలు, సామలు.. ఇలా ఆరురకాల చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటున్నారు. ‘వీటిని క్రమం తప్పకుండా తినే వారికి ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుందని, తద్వారా రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. అప్పటికే బాధపడుతున్న వారికి ఉపశమనం దక్కుతున్నట్లు గుర్తించామని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ శాస్త్రవేత్త సునీత మంగళవారం పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని