వన దుర్గమ్మకు జనహారతి
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

వన దుర్గమ్మకు జనహారతి

భక్తుడు సమర్పించిన వెండిహారంతో అమ్మవారు

పాపన్నపేట: ఏడుపాయల వనదుర్గా భవాని సన్నిధానం భక్తజన సందోహంగా మారింది. ఆదివారం వారాంతపు సెలవుదినం కావడంతో జిల్లావాసులే కాకుండా జంటనగరాలు, ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామున 5.30 గంటలకు అమ్మవారికి అర్చకులు అభిషేకం, సహస్ర నామార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.  ఈ సందర్భంగా పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్‌ఐ సురేష్‌ పర్యవేక్షణలో ఏడుపాయల ఔట్‌పోస్ట్‌ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. వనదుర్గా మాతకు హైదరాబాద్‌కు చెందిన ఎర్ర మహేష్‌ అరకిలో వెండితో చేెయించిన మూడు వరుసల హారాన్ని ఈవో సార శ్రీనివాస్‌కు అందజేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారాన్ని అమ్మవారి మెడలో అలంకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని