ద్వి చక్రవాహనాలు ఢీ.. ఒకరి మృతి
eenadu telugu news
Published : 25/10/2021 03:28 IST

ద్వి చక్రవాహనాలు ఢీ.. ఒకరి మృతి

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కౌడిపల్లి మండలం అంతారం గేట్‌ వద్ద చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చిలప్‌చెడ్‌ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన రంగంపేట శేఖయ్య (54), సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర గ్రామానికి చెందిన చిన్నసాబ్‌ నర్సింలు ద్విచక్ర వాహనంపై వెల్దుర్తిలో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి వెళ్తున్న క్రమంలో అంతారం గేట్‌ వద్ద వీరు కుడి వైపునకు మళ్లిస్తుండగా వెనుకగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలపై ఉన్న నలుగురు కింద పడిపోగా తీవ్రంగా గాయపడ్డారు. శేఖయ్య, నర్సింలు, మరో బైక్‌ ఉన్న నర్సాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌లకు తీవ్రగాయాలవగా, వారిని 108 వాహనంలో నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపు శేఖయ్య మృతిచెందాడు. నర్సింలును సంగారెడ్డి, శ్రీకాంత్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని