ప్రాణం తీసిన మనోవేదన
eenadu telugu news
Published : 25/10/2021 03:28 IST

ప్రాణం తీసిన మనోవేదన

తల్లి మృతితో అనాథ అయిన బాలుడు 

బెల్కటూరు(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తాండూరు మండలం బెల్కటూరులో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈడ్గి సూర్యకళ(38) భర్త శ్రీనివాస్‌గౌడ్‌ గతేడాది కరోనాతో మృతి చెందాడు. అప్పట్నించి ఆమె మనోవేదనకు గురై మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యంమత్తులో ఇంట్లో చీరతో ఉరి వేసుకొంది. కిటికి ద్వారా గుర్తించిన స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదివారం మృతురాలి కుమారుడు నవీన్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది తండ్రి మృతి చెందడంతో కుమారుడు నవీన్‌గౌడ్‌ తొమ్మిదో తరగతితో చదువు మానేశాడు. దుకాణంలో పని చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఏడాది గడవకముందే తల్లి కూడా మృతి చెందడంతో బాలుడి రోదనలు బంధువులు, గ్రామస్థుల్ని కంటతడిపెట్టించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని