శివాజీ నగర్‌ కాలనీకి జ్వరమొచ్చింది..
eenadu telugu news
Published : 25/10/2021 03:30 IST

శివాజీ నగర్‌ కాలనీకి జ్వరమొచ్చింది..

ఏకంగా అనారోగ్యం బారిన 20 మంది

మురుగు కాల్వ పక్కనే నివాసాలు

న్యూస్‌టుడే, తూప్రాన్‌: పురపాలిక పరిధి పోతరాజ్‌పల్లిలోని శివాజీనగర్‌ కాలనీకి జ్వరమొచ్చింది. కాలనీ జనాభా 120 ఉండగా అందులో చిన్నా పెద్దా 20 మంది వరకు జ్వరాల బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో అందులో ఐదుగురు చిన్నారులను హైదరాబాద్‌ నగరంలోని నిలోఫర్‌కు చికిత్సకు తరలించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఆలస్యంగా మేల్కొన్న వైద్య సిబ్బంది ఆదివారం రాత్రి కాలనీకి వచ్చి ఇంటింటి సర్వే చేపట్టారు. అవసరం ఉన్న వారికి మందులు అందజేశారు. పురపాలిక పరిధి పోతరాజ్‌పల్లిలో శివాజీనగర్‌లో 30 కుటుంబాల్లో 100 మందికి పైగా ఉంటున్నారు. 15 రోజులుగా కాలనీ వాసులు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో వెంకటేశ్‌, యాకమ్మ దంపతుల పిల్లలు అమూల్య, ఇషిక, గోపాల్‌, సునీత దంపతుల పిల్లలు రోషన్‌, దేవిక, రాజ్‌కుమార్‌, కృష్ణవేణి దంపతుల కుమార్తె నిరోషకు తీవ్ర జ్వరం రావడంతో వారిని నిలోఫర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొంత మంది చిన్నారులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.


బాధితులు

పారిశుద్ధ్యం లోపం.. ప్రజలకు శాపం

కాలనీలో మురుగు కాల్వలు లేకపోవడంతో ఇళ్లలో నుంచి వస్తున్న మురుగు ఇళ్లకు సమీపంలో ప్రవహిస్తోంది. ఈ దోమలు వృద్ధి చెంది అక్కడి వారు రోగాల పాలవుతున్నారు. పందులు స్వైరవిహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పురపాలిక అధికారులు స్పందించి పారిశుద్ధ్య లోపాన్ని సరి చేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని