Updated : 23/05/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేదలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిట్యాల: అక్షయపాత్ర పేరుతో తహసీల్దార్‌ ఎం.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం చిట్యాలలోని పేదలకు పంపిణీ చేశారు. ప్రజల నుంచి స్వచ్ఛందంగా బియ్యం సేకరించి కార్డు లేని పేదలకు, వలసకూలీలకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ను ఎమ్మెల్యే అభినందించారు. ఇతర మండలాల వారు దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్‌ కె.వెంకట్‌ రెడ్డి, కమిషనర్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని