close

శుక్రవారం, జులై 10, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యుత్తు సంస్కరణల బిల్లు ఉపసంహరించుకోవాలి

నల్గొండలో ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న సీపీఎం నాయకులు

నీలగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు సంస్కరణల బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టి మాట్లాడారు.

నకిరేకల్‌: కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టాన్ని సవరిస్తే పేదలపై ఆర్థిక భారం పడుతుందని సీపీఎం నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నకిరేకల్‌లో దీక్ష చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు ముప్పు వాటిల్లనుందని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాళ ప్రమీల ఆందోళన వ్యక్తం చేశారు.

కొండమల్లేపల్లి: విద్యుత్తు సంస్కరణల బిల్లు వల్ల ప్రజలపై భారం పడుతుందని సీపీఎం మండల కార్యదర్శి లక్ష్మణ్‌నాయక్‌ తెలిపారు. విద్యుత్తు ఉపకేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

నాంపల్లి: విద్యుత్తు సంస్కరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి చంద్రమౌళి డిమాండ్‌ చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్తు ఉపకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

చండూరు: విద్యుత్తు సంస్కరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఎం నాయకులు గట్టుప్పలలోని విద్యుత్తు ఉప కేంద్రం ఎదుట నిరసన తెలియజేశారు.

చిట్యాల: కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల బిల్లును నిరసిస్తూ చిట్యాలలో సీపీఎం నాయకులు దీక్ష నిర్వహించారు.

నిడమనూరు: విద్యుత్తు సంస్కరణల బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఎం నాయకులు పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు.పెద్దఅడిశర్లపల్లి: కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్కరణల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి విజయ్‌కుమార్‌ కోరారు. పార్టీ ఆధ్వర్యంలో ఘనిపల్లిలో నిరసన తెలిపారు.

దేవరకొండ: విద్యుత్తు సంస్కరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపారు.

చింతపల్లి: విద్యుత్తు సంస్కరణల బిల్లును రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రాములు అన్నారు. చింతపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

వేములపల్లి: కేంద్రం నూతన విద్యుత్తు చట్టాన్ని తీసుకొచ్చి రైతులపై పెనుభారం మోపేందుకు ప్రయత్నిస్తుందని రైతు సంఘం జిల్లా నాయకుడు రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.

చిట్యాలలో దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.