గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం: నోముల
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం: నోముల

ఊట్లపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తున్న నర్సింహయ్య

గుర్రంపోడు, న్యూస్‌టుడే: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నర్సింహయ్య అన్నారు. బుధవారం గుర్రంపోడు మండలం ఊట్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను ప్రారంభించి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం

నిడమనూరు: వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. నిడమనూరులో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి ప్రభుత్వం తక్షణం సహాయం కింద రూ.పది వేలు ఇచ్చి, నూతన ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నష్టంపై సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు వరద నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు త్వరగా నివేదించాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని