విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

లాజర్‌ మృతదేహం

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన బుధవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్సై శ్రీనివాసనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం గ్రామానికి చెందిన మీసాల లాజయ్‌(58) బుధవారం పొలానికి నీళ్లు ఎక్కువగా ఉండటంతో మోటార్‌ను బంద్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. పక్కనే గడ్డికోస్తున్న లాజయ్‌ భార్య అక్కడి వచ్చే లోపు మృతి చెంది ఉన్నారు. మృతుని కుమారుడు సాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని