వారం రోజుల్లో పూర్తి చేయండి: కలెక్టర్‌
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారం రోజుల్లో పూర్తి చేయండి: కలెక్టర్‌

దూరదృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పల్లె ప్రకృతివనాల అసంపూర్తి పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, ఎంపీవోలు, వ్యవసాయ అధికారులు, ఏపీవోలతో నిర్వహించిన దూరదృశ్య శ్రవణ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారులు, గ్రామ పంచాయతీల్లో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, వర్షాల వల్ల ఓరిగిన మొక్కలను సరిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రైతుకల్లాల నిర్మాణంపై దృష్టిపెట్టి ఎక్కువ సంఖ్యలో చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీపీవో విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని