వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం
logo
Published : 22/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణం

నవనీత

గుండాల, న్యూస్‌టుడే: వరకట్న వేధింపులతో వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని రామారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి తండ్రి సింహాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలంలోని ఆరెగూడేనికి చెందిన నాగుల సింహాద్రి కుమార్తె నవనీత(23)ను గుండాల మండలంలోని రామారం గ్రామానికి చెందిన ముక్కముల చంద్రయ్య, అరుణ దంపతుల కుమారుడు మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల కట్నం ఒప్పుకొని రూ.6 లక్షలు ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి వల్ల మిగతా రూ.4లక్షలు ఇవ్వకపోవడంతో అత్తింటి వారు వేధింపులకు గురిచేశారు. దీంతో ఈ నెల 11న సాయంత్రం నవనీత ఇంట్లో ఉరివేసుకోగా.. కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స నిమిత్తం మోత్కూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై చందర్‌ తెలిపారు. మృతురాలి తండ్రి నాగుల సింహాద్రి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త మహేష్‌, అత్త అరుణ, మామ చంద్రయ్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని