
కార్మికుల వేతనాలు పెంచాలి: పల్లా

నల్గొండ: జనరల్ ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసి నాయకులు
నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉందని మెడికల్ కాంట్రాక్టు వర్కర్ల సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం జనరల్ ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేశారు. ఈనెల 26న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా మెడికల్ కార్మికులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు. సంఘం జిల్లా నాయకులు పానెం వెంకట్రావు, సీహెచ్ నిర్మల, యాదగిరి, జయమ్మ పాల్గొన్నారు.
Tags :