Published : 26/11/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్ని గ్రామాల్లో నర్సరీలు నిర్వహించాలి

నల్గొండ: వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మొక్కలు పెంచేందుకు అన్ని గ్రామాల్లో నర్సరీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అన్ని నర్సరీల్లో పాలిథిన్‌ సంచుల్లో మట్టినింపుట, కంచె, తదితర పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. వచ్చే సోమవారం వరకు ప్రతి గ్రామంలో 50 మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి హామీ పనికి వచ్చేలా చూడాలని ఆదేశించారు. పీడీ శేఖర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఈఓ వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని