Published : 12/05/2021 06:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిడుగుపాటుకు మహిళా రైతు దుర్మరణం

తుంగతుర్తి, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు పడి ఓ మహిళా రైతు దుర్మరణం పాలైన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఐతరాజు సావిత్ర(40) అనే మహిళ తాను పండించిన ధాన్యం విక్రయానికి ఐకేపీ కేంద్రంలో పోశారు. మంగళవారం సాయంత్రం భారీ గాలితో కూడిన వర్షం కురిసింది. ఈ గాలికి ధాన్యం మీద కప్పిన పట్టాలు ఎలా ఉన్నాయోచూడడానికి కేంద్రం దగ్గరకు వెళ్లారు. ధాన్యం రాసిపై పట్టా లేవటంతో దానిని సరి చేసే క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె పైకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తన రెండెకరాల భూమికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో పోశారు. 20 రోజులైనా తూకం కాలేదు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని