Published : 17/05/2021 06:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువకుడు బలవన్మరణం


చల్లమల్ల సాయికుమార్‌

వలిగొండ, న్యూస్‌టుడే : క్రిమిసంహారక మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్నేపల్లి గ్రామానికి చెందిన చల్లమల్ల సాయికుమార్‌ (24) ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. కొన్ని రోజులుగా అతడికి మతి స్థిమితం లేదు. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే జాలుకాల్వ గ్రామ పరిధి గుట్టల సమీపంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించిన పోలీసులు మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల కోసం రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సాయికుమార్‌ తండ్రి శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె. రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని